హైదరాబాద్, 22 సెప్టెంబర్ (హి.స.)
తెలంగాణ లో నిర్మించ తలపెట్టిన సమ్మక్క సాగర్ ప్రాజెక్టు కు సంబంధించి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అధ్యక్షతన నిర్వహించే సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC) సమావేశం వాయిదా పడింది. ఈ మేరకు అందుకు సంబంధించి సంబంధిత మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులలో సెప్టెంబర్ 23న ఉదయం 11:00 గంటలకు సభ్యుడు డబ్ల్యూపీ అండ్ పీ ఛాంబర్, సీడబ్ల్యూసీ కార్యాలయం న్యూఢిల్లీలో జరగాల్సిన సమావేశం కొన్ని అనివార్య కారణాలతో వాయిదా పడిందని పేర్కొన్నారు. తిరిగి అదే భేటీని సెప్టెంబర్ 25న ఉదయం 11 నిర్వహిస్తామని, సమావేశం జరిగే స్థలంలో ఎటువంటి మార్పు ఉండదని పేర్కొన్నారు. ఈ మేరకు ఐఎంవో ఆశిష్ బెనర్జీ ఉత్తర్వులు జారీ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..