ఏరోస్పేస్-డిఫెన్స్ హబ్ గా తెలంగాణ.. ఇటలీ పారిశ్రామికవేత్తలతో మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్, 22 సెప్టెంబర్ (హి.స.) దేశంలోనే అతిపెద్ద ఏరోస్పేస్-డిఫెన్స్ హబ్ గా తెలంగాణ దూసుకెళ్తాందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో తెలంగాణకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని, పెట్టుబడులకు తెలంగాణలో విస్తారమైన అవకాశాలు ఇ
మంత్రి శ్రీధర్ బాబు


హైదరాబాద్, 22 సెప్టెంబర్ (హి.స.)

దేశంలోనే అతిపెద్ద ఏరోస్పేస్-డిఫెన్స్ హబ్ గా తెలంగాణ దూసుకెళ్తాందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో తెలంగాణకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని, పెట్టుబడులకు తెలంగాణలో విస్తారమైన అవకాశాలు ఇవాళ ఉన్నాయని చెప్పారు. సచివాలయంలో ఇటలీ పారిశ్రామికవేత్తలతో మంత్రి శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న సానుకూల అవకాశాలను వారికి మంత్రి వివరించారు. ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. కాంపోనెంట్ తయారీ, సప్లై చైన్లో పెట్టుబడులను ఆహ్వానించారు. మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్హెల్(ఎంఆర్వో)లో అవకాశాలు ఉన్నాయని, అవియానిక్స్, రాడార్, సెన్సార్ సిస్టమ్స్ పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande