హైదరాబాద్, 22 సెప్టెంబర్ (హి.స.)
కన్న కొడుకు తల్లిదండ్రులను చంపిన ఘటన మేడ్చల్ జిల్లా పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... నేరెడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో లక్ష్మీ (55), రాజయ్య (60) దంపతులు తమ కుమారుడితో పాటు కలిసి నివసిస్తున్నారు. అయితే, గత కొన్ని రోజులుగా కుమారుడు శ్రీనివాస్ మానసిక పరిస్థితి బాగుడటం లేదు. దీంతో తల్లిదండ్రులు బలవంతగా అతడిని ఎర్రగడ్డ మానసిక ఆరోగ్య వైద్యశాలలో చేర్పించారు. చికిత్స పూర్తి అయి ఇంటికి వచ్చిన అతడు తనను మెంటల్ ఆస్పత్రిలో చేరుస్తారా.. అన్న కోపంతో ఆదివారం రాత్రి తల్లిదండ్రులపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దుర్ఘటనలో ఆ ఇద్దరు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..