అమరావతి, 22 సెప్టెంబర్ (హి.స.)విజయవాడ, విశాఖ మెట్రో రైల్ టెండర్లలో పాల్గొనేందుకు జాయింట్ వెంచర్స్‌కు అవకాశం ఇస్తున్నట్లు ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ ఎన్పీ రామకృష్ణా రెడ్డి తెలిపారు. గరిష్టంగా 3 కంపెనీలు కలిసి జేవీగా టెండర్లు వేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రీ-బిడ్ మీటింగ్‌కు హాజరైన కాంట్రాక్ట్ సంస్థల నుంచి వచ్చిన వినతిపై ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. ఈ మేరకు ఆయన ఇవాళ(సోమవారం) మీడియాతో మాట్లాడారు..
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ