ప్రభాకర్రావు బెయిల్ రద్దు పిటిషన్.. సుప్రీం కోర్టులో విచారణ వాయిదా
హైదరాబాద్, 22 సెప్టెంబర్ (హి.స.) ఫోన్ ట్యాపింగ్ కేసులో A1గా ఉన్నమాజీ ఐపీఎస్ ప్రభాకర్ రావు విచారణకు సహకరించడం లేదని, ఈ మేరకు ఆయన వేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే, ఆ పిటిషన్పై ఇవాళ మరో
ఫోన్ టాపింగ్


హైదరాబాద్, 22 సెప్టెంబర్ (హి.స.)

ఫోన్ ట్యాపింగ్ కేసులో A1గా ఉన్నమాజీ ఐపీఎస్ ప్రభాకర్ రావు విచారణకు సహకరించడం లేదని, ఈ మేరకు ఆయన వేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే, ఆ పిటిషన్పై ఇవాళ మరోసారి జస్టిస్ బీవీ నాగరత్న ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు కేసు విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. తదుపరి విచారణకు వచ్చే నెల 8న చేపడుతామని న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న పేర్కొన్నారు.

విచారణ సందర్భంగా కేసు దర్యాప్తునకు సంబంధించి ప్రస్తుత స్టేటస్ రిపోర్టును దాఖలు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఇప్పటికే కోర్టుకు తెలిపారు. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, సాక్ష్యాధారాలు టాంపరింగ్ చేశారని ప్రభుత్వ తరఫు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా కోర్టుకు వివరించారు. డేటా రికవరీ చేయడానికి కూడా ప్రభాకర్ రావు సహకరించడం లేదన్నారు. ప్రభాకర్రావు ఇచ్చిన ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ ఫార్మాట్ చేసి ఇచ్చారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ల్యాప్టాప్ కూడా అదే స్థితిలో ఉందని, దానిలో ఎలాంటి సమాచారం లేదని గత విచారణలో కోర్టు దృష్టి తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే తన క్లయింట్ ప్రభాకర్ రావు కేసు విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరవుతున్నారని.. ఆయన తరఫు న్యాయవాది శేషాద్రి నాయుడు ధర్మాసనానికి తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande