తెలంగాణ, నిజామాబాద్. 22 సెప్టెంబర్ (హి.స.) నిజామాబాద్ జిల్లా ఆర్మూర్
నియోజకవర్గంలోని ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో ఆదివారం రాత్రి విజిలెన్స్ డిపార్ట్మెంట్, ఆర్మూర్ పోలీసులు పక్కా సమాచారం మేరకు సంయుక్తంగా దాడి చేసి ప్రజా పంపిణీ బియ్యాన్ని తరలిస్తున్న లారీని పట్టుకున్నారు. ప్రజా పంపిణీ బియ్యాన్ని తరలిస్తున్న లారీలో 280 బస్తాలలో 145 క్వింటాళ్ల బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రజా పంపిణీ బియ్యాన్ని అక్రమంగా లారీలో తరలిస్తున్న కడమంచి అంజి, కడమంచి మహేందర్, కడమంచి రాజయ్య, కమ్మర్పల్లి కొండపల్లి నరేష్, అస్లాం, నాగేష్ రైస్ మిల్ యజమానీ లపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఆర్మూర్ పోలీసులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు