తెలంగాణ, సిద్దిపేట. 22 సెప్టెంబర్ (హి.స.) నర్మెట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ మనకు ఎమోషన్ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెటలో నేడు హరీశ్రావు పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పామాయిల్ ఫ్యాక్టరీలో ఉత్పత్తిని ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్రెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీలు వంటేరు యాదవరెడ్డి, దేశపతి శ్రీనివాస్తో కలిసి వారు పరిశీలించారు. ఈ సందర్భంగా హరీష్ రావు ఆయన మాట్లాడుతూ.. నర్మెట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ మనకు ఎమోషన్ అని.. ఈ ఫ్యాక్టరీ వేలాది మంది రైతుల జీవితాల్లో గుణాత్మక మార్పును తీసుకువస్తుందన్నారు. మనం చాలా ఫాక్టరీలు చూస్తుంటామని.. కానీ, ఇది భిన్నమైందన్నారు. ఈ ప్రాంత రైతుల నవశకానికి ఈ ఫ్యాక్టరీ నాంది అని తెలిపారు. గాలిలో తేమ ఎక్కువ ఉన్న చోటనే పామాయిల్ పండుతుందని.. కేసీఆర్ కృషితో రాష్ట్రమంతా పామాయిలు అనుకూలంగా మారిందన్నారు. ఒక్కసారి పంట వేస్తే 30 సంవత్సరాల వరకు రైతుకు ఆదాయం వస్తుందన్న ఆయన.. ఉద్యోగులకు నెల రోజుకు జీతం వస్తే.. పామాయిల్ రైతులకు 20 రోజులకే డబ్బులు చేతికి అందుతాయన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు