తెలంగాణ, ఆసిఫాబాద్. 22 సెప్టెంబర్ (హి.స.)
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ పట్టణంలో సోమవారం ఉదయం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జీవనోపాధి కోసం వలస వచ్చిన ఓ కార్మికుల కుటుంబం రైల్వే ట్రాక్పై ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో తల్లి స్వప్న (26), మూడేళ్ల పాప సూర్యవంశి అక్కడికక్కడే మృతి చెందగా, అపస్మారక స్థితిలో ఉన్న భర్త జగత్ రామ్ ను స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జార్ఖండ్కు చెందిన జగత్ రామ్ కుటుంబంతో కలిసి కొన్నేళ్ల క్రితం కాగజ్ నగర్లో స్థిరపడ్డాడు. ఆర్థిక ఇబ్బందులు భరించలేక కుటుంబం ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు ప్రాథమికంగా పోలీసులు భావిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు