మక్తల్ బస్టాండ్లో భారీ చోరీ.. 10 తులాల బంగారం అపహరణ..
నారాయణపేట, 22 సెప్టెంబర్ (హి.స.) నారాయణపేట జిల్లా మక్తల్ బస్టాండ్లో సోమవారం మధ్యాహ్నం భారీ చోరీ జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు బాధితుల నుండి 10 తులాల బంగారం, రూ. 50వేల నగదు ఉన్న పర్సును చోరీ చేసినట్టుగా బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్క
బంగారం చోరీ


నారాయణపేట, 22 సెప్టెంబర్ (హి.స.)

నారాయణపేట జిల్లా మక్తల్ బస్టాండ్లో సోమవారం మధ్యాహ్నం భారీ చోరీ జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు బాధితుల నుండి 10 తులాల బంగారం, రూ. 50వేల నగదు ఉన్న పర్సును చోరీ చేసినట్టుగా బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితురాలు మైమూనా బేగం చెప్పిన వివరాల ప్రకారం.. తమ ఇంట్లో జరిగే పెళ్లికి కొత్తగా నగలు చేయించాలని ఇంట్లో ఉన్న పాత బంగారాన్ని రూ. 50 వేల నగదును పర్స్లో ఉంచుకొని మధ్యాహ్నం నారాయణపేటకు వెళ్లడానికి బస్సు ఎక్కి సీట్లో కూర్చున్నాక బ్యాగు చూసుకుంటే బంగారం, నగదున్న పర్సు కనపడలేదని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. జరిగిన సంఘటనపై మక్తల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టుగా బాధితురాలు మైమూన బేగం తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande