అమరావతి, 22 సెప్టెంబర్ (హి.స.)
: విజయవాడ ఉత్సవ్‌పై సుప్రీం కోర్టును ఆశ్రయించిన స్థానిక భక్తులకు చుక్కెదురైంది. వారు దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. దేవాదాయ శాఖకు చెందిన స్థలంలో విజయవాడ ఉత్సవ్ నిర్వహణపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దేవాదాయ శాఖ స్థలంలో దైవ కార్యకలాపాలు మినహా ఎలాంటి కార్యక్రమాలు చేయడానికి లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై ఇటీవల హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు
దేవాదాయ శాఖ పరిధిలోని ఆ స్థలం వ్యవసాయ భూమి అని, అక్కడ ఇప్పుడు వ్యాపార పరమైన కార్యక్రమాలు చేపట్టడం విరుద్దమని పిటిషనర్లు పేర్కొన్నారు. ఈ విషయంపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. పిటేషన్‌ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ