ఏపీలో సేవలు మరింత సులభతరం -చంద్రబాబు నాయుడు
విశాఖపట్టం,22 సెప్టెంబర్ (హి.స.)ఏపీలో ప్రజా సేవలు సులభతరం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇప్పటికే వాట్సప్​గవర్నెన్స్​ను తీసుకు వచ్చామని , సంజీవని వంటి అత్యాధునిక సేవలను ఇంటి వద్దకే తీసుకు వస్తు న్నట్లు ఆయన ప్రకటించారు. విశాఖల
చంద్రబాబు


విశాఖపట్టం,22 సెప్టెంబర్ (హి.స.)ఏపీలో ప్రజా సేవలు సులభతరం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇప్పటికే వాట్సప్​గవర్నెన్స్​ను తీసుకు వచ్చామని , సంజీవని వంటి అత్యాధునిక సేవలను ఇంటి వద్దకే తీసుకు వస్తు న్నట్లు ఆయన ప్రకటించారు. విశాఖలో 28వ ఈ గవర్నెన్స్​జాతీయ సదస్సును ఆయన ప్రారంభించారు. డిజిటల్​ఏపీ సంచికను ఆవిష్కరించారు. సివిల్​సర్వీస్​అండ్​డిజిటల్​ట్రాన్స్​ఫార్మేషన్​అనే థీమ్​తో సదస్సు నిర్వహించారు. కేంద్ర ఎలక్ట్రానిక్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ, ఏపీ ప్రభుత్వం సంయుక్తంగా ఈ సదస్సు జరుపుతోంది. ఏఐ, సైబర్​సెక్యూరిటీ, పౌరసేవలు, అగ్రి స్టాక్​వంటి అంశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేళ్లలో ఐటీ రంగం కొత్త మలుపు తీసుకోబోతోందనిఅన్నారు. తలసరి ఆదాయంలో మనవాళ్లే టాప్‌, ప్రపంచంలోనే ఎక్కువ సంపాదిస్తోంది తెలుగు వారే అని తెలిపారు.

ఐటీలో హైదరాబాద్‌ను అగ్రగామిగా మార్చాం, నాలెడ్జ్‌ ఎకనామీనే మనల్ని నడిపించబోతోందని సీఎం తెలిపారు. సాంకేతికతకు అనుగుణంగా మనమూ మారాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఇవాళ అన్ని సేవలకు ప్రజలకు ఆన్​లైన్​లో అం దుబాటులోకి వచ్చాయని తెలిపారు. పోటీ ప్రపంచంలో వినూత్న నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయన్నారు. సంకల్పం ఉంటే మంచి పనులు ఎన్నయినా చేయవచ్చని అన్నారు. సరైన సమయంలో సరైన నాయకుడు దేశానికి ఉన్నాడని వ్యాఖ్యానించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande