హైదరాబాద్, 22 సెప్టెంబర్ (హి.స.)అల్పపీడనం ప్రభావంతో హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం కురిసింది.
ఖైరతాబాద్-రాజ్‌భవన్ రోడ్డులో మోకాలి లోతు నీరు నిలిచి పోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అమీర్‌పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. వరద నీరు నిలిచిన ప్రాంతాల్లో హైడ్రా, జీహెచ్‌ఎంసీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.
ఉత్తర ఈశాన్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఇవాళ ఉదయం అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాగల 24 గంటల్లో ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశలో కదిలి వాయువ్య బంగాళాఖాతం ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉందని వెల్లడించింది. అల్పపీడనం ప్రభావంతో రాష్ర్టంలో సోమవారం, మంగళవారం ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు తెలిపారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు