కొనసాగుతున్న యూరియా కష్టాలు.. జాతీయ రహదారిపై రైతుల ధర్నా. రాస్తారోకో
తెలంగాణ, ఆసిఫాబాద్. 22 సెప్టెంబర్ (హి.స.) తాము సాగు చేసిన పంటలకు సరిపడా యూరియాను పంపిణీ చేయాలని మళ్లీ అన్నదాతలు రోడెక్కారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల కేంద్రంలోని వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘం కార్యాలయం సమీపంలో గల జాతీయ రహదారిపై సోమవార
రైతుల ధర్నా


తెలంగాణ, ఆసిఫాబాద్. 22 సెప్టెంబర్ (హి.స.)

తాము సాగు చేసిన పంటలకు సరిపడా యూరియాను పంపిణీ చేయాలని మళ్లీ అన్నదాతలు రోడెక్కారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల కేంద్రంలోని వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘం కార్యాలయం సమీపంలో గల జాతీయ రహదారిపై సోమవారం రైతులు రాస్తారోకో నిర్వహించారు. నేడు యూరియా పంపిణీ చేస్తున్నారని వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘం కార్యాలయానికి రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయితే అక్కడ సరిపడా యూరియా బస్తాలు లేకపోవడంతో ఆగ్రహించి ఆందోళన దిగారు. ఈ విషయం తెలిసిన వెంటనే రెబ్బెన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని రైతులకు ఎంత నచ్చజెప్పిన వినకుండా ఆందోళన కొనసాగించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande