అమరావతి, 23 సెప్టెంబర్ (హి.స.):భయపడినట్టే గుంటూరులో కలరా నిర్ధారణ అయింది..! జిల్లాలో సోమవారం నాలుగు కలరా కేసులు బయటపడ్డాయి. ఇందులో గుంటూరు నగరంలో మూడు, తెనాలిలో ఒకటి ఉన్నాయి. గుంటూరులో ఐదు రోజులుగా వాంతులు, విరేచనాలతో బాధపడుతూ 146 మంది డయేరియా బారినపడ్డారు. వీరంతా గుంటూరు జీజీహెచ్‌తో పాటు ప్రైవేటు వైద్యశాలల్లో చేరారు. ఇప్పటి వరకు 62 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా ఉన్న రోగుల నుంచి 114 నమూనాలను సేకరించి గుంటూరు వైద్య కళాశాల మైక్రోబయాలజీ ల్యాబ్‌లో పరీక్షించగా సోమవారం 91 నమూనాల ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో మూడు నమూనాల్లో ‘విబ్రియో కలరే’ బ్యాక్టీరియా, 16 నమూనాల్లో ఈ.కోలి బ్యాక్టీరియా, ఒకదానిలో షిగెల్లా బ్యాక్టీరియా ఉన్నట్టు నిర్ధారించారు. 71 నమూనాల్లో ఎలాంటి బ్యాక్టీరియా లేదని తేలింది. తెనాలి మండలం అంగలకుదురులో ఒక యువతి కలరా బారినపడినట్టు ప్రైవేటు వైద్యశాలలో నిర్వహించిన పరీక్షల్లో
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ