కడప: 26 సెప్టెంబర్ (హి.స.)ప్రయాణికుల సౌకర్యార్థం ప్రస్తుతం ఉన్న బస్సులకు అదనంగా మరో 1050 ఎలక్ట్రిక్ బస్సులు()రానున్నాయని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు)తెలిపారు. కడప గ్యారేజీని ఆర్టీసీ ఎండీతో పాటు ఈడీఈ చెంగల్‌రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్యారేజీ, బస్టాండు స్థితిగతులను గురించి కడప ఆర్‌ఎం గోపాల్‌రెడ్డి, ఇతర అధికారులతో ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడప ఆర్టీసీ బస్టాండు ఆవరణాన్ని పూర్తిగా సిమెంటు రోడ్డుతో తీర్చిదిద్దేందుకు అనువుగా రూ.1.30 కోట్లుతో త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ