తిరుపతి, 26 సెప్టెంబర్ (హి.స.)
(తితిదే): శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఒంటిపై బంగారంతో ప్రత్యక్షమైన వ్యక్తిని చూసేందుకు భక్తులు ఎగబడ్డారు. హైదరాబాదుకు చెందిన హోప్ ఫౌండేషన్ ఛైర్మన్ విజయ్‌కుమార్ దాదాపు ఆరు కిలోల బంగారు ఆభరాణాలతో ప్రత్యక్షమయ్యారు. అసలే బ్రహ్మోత్సవాల సమయం కావడం, భక్తుల రద్దీ నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలంటూ పోలీసులు ఆయనకు సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ