అన్నవరం, 26 సెప్టెంబర్ (హి.స.)
: కాకినాడ జిల్లా అన్నవరం ఆలయ పరిసరాల్లో అగ్నిప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున రత్నగిరిపై పడమటి రాజగోపురం వద్ద దుకాణ సముదాయంలో మంటలు వచ్చాయి. వెంటనే గమనించి భద్రతా సిబ్బంది అగ్నిమాపక పరికరాలతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఫ్యాన్సీ, మరో ఐదు దుకాణాలకు మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదానికి విద్యుదాఘాతమే కారణమని అధికారులు భావిస్తున్నారు. భారీగా ఆస్తినష్టం వాటిల్లినట్లు సమాచారం.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ