తిరుమల, 26 సెప్టెంబర్ (హి.స.)
: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం స్వామివారికి సింహ వాహన సేవ నిర్వహించారు. మలయప్ప స్వామివారు సింహ వాహనాన్ని అధిరోహించి యోగముద్ర అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మాడ వీధుల్లో వివిధ కళాబృందాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి వాహనసేవలో పాల్గొని కర్పూర హారతులు సమర్పించారు. మరోవైపు రాత్రి 7 గంటలకు స్వామివారు ముత్యపు పందిరి వాహనంపై భక్తులకు అభయ ప్రదానం చేయనున్నారు.
---------------
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ