తెలంగాణ, భద్రాద్రి కొత్తగూడెం. 26 సెప్టెంబర్ (హి.స.)
గంజాయిని పూర్తిగా అరికట్టడమే లక్ష్యంగా భద్రాద్రి పోలీసులు ప్రత్యేకంగా పావులు కదుపుతున్నారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ప్రత్యేక చొరవతో కట్టుదిటమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇకనుంచి గంజాయి తాగితే జైలుకే.. ఎవరైనా అమ్మితే వారి ఆస్తులు ప్రభుత్వం జప్తు చేసుకుంటుంది అని కఠినమైన నిర్ణయాలు తీసుకోవడంతో జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లా పోలీసులు శతవిధాలుగా ప్రయత్నించినా, సరిహద్దుల్లో కాపు కాసి కట్టడి చేయాలని చూసినా ఏదో ఒక విధంగా వారి కళ్ళని కప్పి జిల్లాలోకి గంజాయి చేరుకుంటుంది ఇది గ్రహించిన జిల్లా ఎస్పీ ఏ విధంగానైనా జిల్లాలోకి గంజాయిని రానీయకూడదు. అనే ఉద్దేశంతో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం కూడా గంజాయిపై గరంగా ఉండడంతో గంజాయి తాగితే కచ్చితంగా జైలుకు పంపిస్తామని నిరూపిస్తున్నారు.ఇటీవల గంజాయి తాగుతూ పట్టుబడిన ఐదుగురిని జైలుకు పంపించిన సంఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది. కొత్తగూడెం 1 టౌన్ పరిధిలో లో ముగ్గురిని, 2 టౌన్ పరిధిలో ముగ్గురిని గంజాయి తాగుతుండగా పట్టుకుని జైలుకు పంపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు