హైదరాబాద్, 26 సెప్టెంబర్ (హి.స.)
ఆపరేషన్ సిందూర్ తర్వాత దేశంలోకి ఉగ్రవాదుల చొరబాటుపై కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలోనే స్వదేశంలోనే ఉంటూ టెర్రరిస్టులకు ఉప్పందిస్తున్న వారిపై ఎన్ఐఏ (NIA) ఫుల్ ఫోకస్ పెట్టింది. ఈ మేరకు ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో పలువురు స్లీపర్ సెల్స్తో తో పాటు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ రాష్ట్రం కీలక పరిణామం చోటుచేసుకుంది. కోల్కతా నుంచి సికింద్రాబాద్ కు వస్తున్న ఫలక్నామ ఎక్స్ప్రెస్ లో ఉగ్రవాదులు ఉన్నారంటూ ఇంటెలిజెన్స్ నుంచి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన ఆర్పీఎఫ్ సిబ్బంది రైలును ఘట్కేసర్ రైల్వే స్టేషన్లో ఉదయం 9.50కి నిలిపివేసి అన్ని కంపార్ట్మెంట్లలో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. అనుమానం వచ్చిన ప్రతి వ్యక్తితో పాటు వెంట ఉన్న బ్యాగేజీలను చెక్ చేశారు. సమారు గంట పాటు సోదాలు చేపట్టిన అనంతరం టెర్రరిస్టులు ఎవరూ లేరని నిర్ధారించాక 11 గంటలకు రైలు యథావిధిగా ముందుకు కదిలింది.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు