హైదరాబాద్, 26 సెప్టెంబర్ (హి.స.) తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు
ఇంటర్ బోర్డు శుభవార్త చెప్పింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ కంటే ఒకరోజు ముందు నుంచే దసరా సెలవులను ప్రకటించింది. రేపటి నుంచే రాష్ట్రంలో అన్ని జూనియర్ కాలేజీలకు దసరా సెలవులు ఇస్తున్నట్లు తెలిపింది. అక్టోబర్ 5 వరకూ ఇంటర్ విద్యార్థులకు దసరా హాలిడేస్ ఇస్తూ ప్రకటన విడుదల చేసింది. సెలవు రోజుల్లో ఏ కాలేజీ యాజమాన్యమైనా క్లాసులు నిర్వహిస్తే.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలు దసరా సెలవుల షెడ్యూల్ ను పాటించాలని ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు జారీ చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..