భారీ వర్షాల నేపథ్యం.. జంట జలాశయాలకు వరద ముప్పు..
హైదరాబాద్, 26 సెప్టెంబర్ (హి.స.) జంట జలాశయాలైన గండిపేట, హిమాయత్ సాగర్ చెరువులకు వరద ముప్పు పొంచి ఉంది. ఎగువ ప్రాంతమైన రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలలో గురువారం రాత్రి నుంచి భారీగా వర్షం కురుస్తుండటంతో రెండు చెరువుల్లోకి వరద భారీగా వస్తుంది. ఈ నేపథ్
జంట జలాశయాలు


హైదరాబాద్, 26 సెప్టెంబర్ (హి.స.)

జంట జలాశయాలైన గండిపేట,

హిమాయత్ సాగర్ చెరువులకు వరద ముప్పు పొంచి ఉంది. ఎగువ ప్రాంతమైన రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలలో గురువారం రాత్రి నుంచి భారీగా వర్షం కురుస్తుండటంతో రెండు చెరువుల్లోకి వరద భారీగా వస్తుంది. ఈ నేపథ్యంలో రెండు జలాశయాలకు వరద ముప్పు పొంచి ఉందని అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఉస్మాన్ సాగర్ 10 గేట్లను 6 ఫీట్ల మేర పైకి ఎత్తారు. ప్రస్తుతం జలాశయానికి 6000 క్యూసెక్కుల వరద వస్తుంది. అవుట్ ఫ్లో 6370 క్యూసెక్కులు ఉంది. జలాశయం ఎఫ్.టి.ఎల్ 1790 ఫీట్లు అయితే శుక్రవారం మధ్యాహ్నం వరకు 1789 ఫీట్లకు నీరు చేరింది. హిమాయత్ సాగర్ పూర్తి మట్టం 1763 ఫీట్లు.. శుక్రవారం మధ్యాహ్నం వరకు ఫుల్ ట్యాంకు లెవల్ కు నీటి మట్టం చేరుకుంది. శుక్రవారం మూడున్నర గంటల వరకు ఐదు గేట్లను మూడు ఫీట్ల ఎత్తు లేపి దిగువ ప్రాంతానికి నీటిని వదులుతున్నారు. 6000 క్యూసెక్కుల ఇన్స్లో కొనసాగుతుండగా 5086 అవుట్ లో ఉంది. ఎగువ ప్రాంతమైన వికారాబాద్ రంగారెడ్డి జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తుండడంతో వాగులు వంకల ద్వారా రెండు జలాశయాలలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande