అమరావతి, 26 సెప్టెంబర్ (హి.స.) :ఏపీ జీఎస్టీ సవరణ బిల్లు 2025ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సభ ముందుకు తీసుకువచ్చారు. చర్చ అనంతరం ఈ బిల్లుకు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి పయ్యావులు సభలో మాట్లాడుతూ.. ఈ బిల్లుపై సీఎం చాలా సుదీర్ఘంగా వివరించారని.. జీఎస్టీ మీద దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోందన్నారు. ప్రజలకు పన్నుల రూపంలో వసూలు చేసేటప్పుడు గతంలో 4 టాక్స్ స్లాబ్‌లు ఉండేవని.. దీని వల్ల కన్ఫ్యూజన్ ఉండేదని తెలిపారు. దీంతో దేశ వ్యాప్తంగా జీఎస్టీపై పెనుమార్పులు తీసుకురావాలని సూచించినట్లు చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ