హైదరాబాద్, 26 సెప్టెంబర్ (హి.స.)
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిత్వంపై భారత రాష్ట్ర సమితి తెర దించింది. ఆ పార్టీ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత పేరు ఖరారు చేసింది. ఈ మేరకు ఇవాళ గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ ఆమె అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించారు. కాగా, అనారోగ్య కారణాలతో జూన్ 8న ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. ఆయన మృతితో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది. త్వరలో అందుకు సంబంధించిన షెడ్యూల్ను ఎన్నికల సంఘం వచ్చే నెల రెండో వారంలో విడుదల చేయనుంది. అయితే, తొలుత దివంగత పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి, మాగంటి గోపినాథ్ సోదరుడు వజ్రానాథ్, రావుల శ్రీధర్ రెడ్డి పేర్లు టికెట్ రేసులో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు ఫస్ట్ నుంచి గోపినాథ్ సతీమణి సునీతకే టికెట్ ఇచ్చేందుకు సముఖత చూపారు. ఈ క్రమంలోనే ఇవాళ ఆమెను అభ్యర్థిగా ఖరారు ఫైనల్ చేస్తూ గులాబీ బాస్ నిర్ణయం తీసుకున్నారు.
ఉప ఎన్నికలకు పార్టీ అభ్యర్థిని అందరి కంటే ముందుగానే ప్రకటించి ప్రచారంలో దూసుకుపోవచ్చే ఆలోచనతో కేసీఆర్ అభ్యర్థిత్వానికి తెర దింపినట్లుగా తెలుస్తోంది.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..