మూసీని తలపిస్తున్న కోఠీ ఈఎన్టీ హాస్పిటల్.. పట్టించుకోని అధికారులు
హైదరాబాద్, 26 సెప్టెంబర్ (హి.స.) కొఠి ఈఎన్టీ హాస్పిటల్ మూసీని తలపిస్తోంది. సుమారు నెల రోజుల క్రితం హాస్పిటల్ ఆవరణలోని నాలా పై కప్పు పగిలిపోయింది. అప్పటి నుండి సిటీలో కురుస్తున్న భారీ వర్షాలకు నాలా పొంగి మురుగు హాస్పిటల్ను ముంచెత్తుతోంది. దీంతో ఆస్
ENT హాస్పిటల్


హైదరాబాద్, 26 సెప్టెంబర్ (హి.స.)

కొఠి ఈఎన్టీ హాస్పిటల్ మూసీని తలపిస్తోంది. సుమారు నెల రోజుల క్రితం హాస్పిటల్ ఆవరణలోని నాలా పై కప్పు పగిలిపోయింది. అప్పటి నుండి సిటీలో కురుస్తున్న భారీ వర్షాలకు నాలా పొంగి మురుగు హాస్పిటల్ను ముంచెత్తుతోంది. దీంతో ఆస్పత్రిలో పని చేస్తున్న వైద్యులు, సిబ్బంది, రోగులు, వారి సహాయకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి చెవి, ముక్కు, గొంతు సంబంధ వ్యాధుల చికిత్సలకు సుమారు వెయ్యి మంది వరకు రోగులు ఈ హాస్పిటల్ వస్తుంటారు. దీంతో ఉదయం నుండి మధ్యాహ్నం వరకు రద్దీ అధికంగా ఉంటుంది. వందలాది మంది క్యూ లైన్లో నిలుచుంటారు. ఇంత రద్దీ ఉండే ఆస్పత్రిలో ఆవరణలో నాలా పై కప్పు పగిలిపోయి ఏరులై పారుతోంది. దీంతో రోగులు, వైద్యులు, సిబ్బంది ఇందులో నుండే ముక్కుమూసుకుని నడుస్తున్నారు ఆవరణ పూర్తిగా చెరువును తలపిస్తుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande