'త్రిబుల్ఆర్ బాధితులకు అండగా ఉంటా': ఎమ్మెల్యే కోమటిరెడ్డి
తెలంగాణ, నల్గొండ. 26 సెప్టెంబర్ (హి.స.) భూ నిర్వాసితులకు న్యాయం చేయడానికి త్రిబుల్ఆర్ దక్షిణ భాగం రహదారి వెళ్తున్న నియోజకవర్గాల శాసనసభ్యులతో కలిసి సీఎంతో మాట్లాడి మీకు న్యాయం చేస్తానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హామీ ఇచ్చారు.
ఎమ్మెల్యే కోమటిరెడ్డి


తెలంగాణ, నల్గొండ. 26 సెప్టెంబర్ (హి.స.)

భూ నిర్వాసితులకు న్యాయం

చేయడానికి త్రిబుల్ఆర్ దక్షిణ భాగం రహదారి వెళ్తున్న నియోజకవర్గాల శాసనసభ్యులతో కలిసి సీఎంతో మాట్లాడి మీకు న్యాయం చేస్తానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హామీ ఇచ్చారు. శుక్రవారం త్రిబుల్ఆర్ దక్షిణ భాగం రహదారి కింద మునుగోడు నియోజకవర్గంలో భూములు కోల్పోతున్న చౌటుప్పల్, నారాయణపురం, గట్టుప్పల్, మర్రిగూడెం మండలాలకు చెందిన భూ నిర్వాసితులు మాకు న్యాయం చేయాలని మునుగోడులోని క్యాంపు కార్యాలయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఆశ్రయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భూమికి రైతుకు మధ్య భావోద్వేగ బంధం ఉంటుందన్నారు. భూమి కోల్పోతున్న బాధలో మీరు పడుతున్న ఆవేదనకు మీరు చేస్తున్న డిమాండ్లను నేను ఏకీభవిస్తున్నారు. పార్టీ, ప్రభుత్వం కంటే ప్రజలే ముఖ్యమన్నారు. అధికార పార్టీలో ఉన్నప్పటికీ ప్రజల పక్షాన మాట్లాడతానన్నారు.

పదవి అంటే కిరీటం కాదని బాధ్యతనన్నారు. దర్మం, న్యాయం వైపే రాజగోపాల్ రెడ్డి ఉంటాడన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande