రోడ్ల నిర్మాణంలో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవు: మంత్రి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
తెలంగాణ, సూర్యాపేట. 26 సెప్టెంబర్ (హి.స.) రోడ్ల నిర్మాణ పనులలో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని, నాణ్యత పాటిస్తూ నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను కాంట్రాక్టర్లను ఆదేశించా
మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి


తెలంగాణ, సూర్యాపేట. 26 సెప్టెంబర్ (హి.స.)

రోడ్ల నిర్మాణ పనులలో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని, నాణ్యత పాటిస్తూ నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను కాంట్రాక్టర్లను ఆదేశించారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల పరిధిలోని గానుగబండ గ్రామంలో గానుగ బండ నుండి పరెడ్డిగూడెం, గానుగ బండ నుండి హనుమంతుల గూడెం రోడ్డు నిర్మాణ పనులకు, అలాగే కల్మలచెరువు నుండి దర్శించర్ల వరకు, కల్మలచెరువు నుండి గానుగబండ వరకు నిర్మించే రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande