యువకులు నమ్మిన సిద్ధాంతం కోసం నడుం బిగించాలి : నిర్మల్ బిజెపి ఎమ్మెల్యే ఏలేటి
తెలంగాణ, నిర్మల్. 26 సెప్టెంబర్ (హి.స.) యువకులు నమ్మిన సిద్ధాంతం కోసం నడుం బిగించి ముందుకు నడవాలని, అలాగే వీరత్వానికి ఛత్రపతి శివాజీ మహారాజ్ ప్రతీక అని, యువత లక్ష్యసాధనకు శివాజీని ఆదర్శంగా తీసుకోవాలని నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నార
బిజెపి ఎమ్మెల్యే


తెలంగాణ, నిర్మల్. 26 సెప్టెంబర్ (హి.స.)

యువకులు నమ్మిన సిద్ధాంతం కోసం

నడుం బిగించి ముందుకు నడవాలని, అలాగే వీరత్వానికి ఛత్రపతి శివాజీ మహారాజ్ ప్రతీక అని, యువత లక్ష్యసాధనకు శివాజీని ఆదర్శంగా తీసుకోవాలని నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మామడ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశం కోసం ధర్మం కోసం ఎంతగానో ఛత్రపతి పోరాటం చేశాడని, అలాగే,ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కృషి చేశారన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande