న్యూఢిల్లీ, 26 సెప్టెంబర్ (హి.స.)
ఓటుకు నోటు కేసులో మరో సంచలన
2016 పరిణామం చోటుచేసుకుంది. A4గా ఉన్న జెరూసలేం మత్తయ్యకు భారీ ఊరట లభించింది. కేసు నుంచి ముత్తయ్యను తప్పిస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సెన్సేషనల్ తీర్పును వెలువరించింది. కాగా, జెరూసలేం మత్తయ్యపై నమోదైన ఎఫ్ఎఆర్ను తెలంగాణ హైకోర్టు క్వాష్ చేసింది. దీంతో అప్పటి బీఆర్ఎస్ సర్కార్ ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అదే ఏడాది జులై 6న సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అదేవిధంగా కేసులో కీలక సాక్షిగా ఉన్న ఎల్విస్ స్టీఫెన్సన్ కూడా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తాజాగా, ఆ పిటిషన్లపై ఇవాళ మరోసారి విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషనన్ను కొట్టివేసింది. అదేవిధంగా కేసులో A4గా జెరూసలేం మత్తయ్యను తప్పిస్తూ కోర్టు సంచలన ఉత్తర్వులు జారీ చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు