పీలేరు, 26 సెప్టెంబర్ (హి.స.)
:ప్రస్తుతం మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న పీలేరు త్వరలో మున్సిపాలిటీగా అవతరించనున్నట్లు తెలుస్తోంది. దినాదినాభివృద్ధి చెందుతున్న పీలేరును అభివృద్ధి పథంలో నిలపాలంటే మున్సిపాలిటీగా చేయక తప్పదనే అభిప్రాయంతో ఎమ్మెల్యే నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి ఆ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేశారని టీడీపీ(TDP)నాయకులు చెబుతున్నారు. భౌగోళికంగా, జనాభా పరంగా, ఆర్థికపరంగా ఏనాడో మున్సిపాలిటీ స్థాయికి చేరుకున్న పీలేరు గ్రామ పంచాయతీ గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా మున్సిపాలిటీ కాలేకపోయిందని, పెరుగుతున్న అవసరాల దృష్ట్యా దానిని మున్సిపాలిటీగా మార్చక తప్పడం లేదని వారు అభిప్రాయపడుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ