రెడ్ అలర్ట్.. తెలంగాణ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు
తెలంగాణ, 26 సెప్టెంబర్ (హి.స.) క్లౌడ్ బరస్ట్, క్యుములోనింబస్ మేఘాలు, అల్పపీడనంతో కురిసే వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. భారీవర్షాలు రోడ్లు ఏకంగా నదులను తలపిస్తున్నాయనడంలో సందేహం లేదు. తాజాగా మరోసారి తెలంగాణ జిల్లాలకు వాతావరణశాఖ రెడ్,
రెడ్ అలర్ట్


తెలంగాణ, 26 సెప్టెంబర్ (హి.స.)

క్లౌడ్ బరస్ట్, క్యుములోనింబస్

మేఘాలు, అల్పపీడనంతో కురిసే వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. భారీవర్షాలు రోడ్లు ఏకంగా నదులను తలపిస్తున్నాయనడంలో సందేహం లేదు. తాజాగా మరోసారి తెలంగాణ జిల్లాలకు వాతావరణశాఖ రెడ్, ఆరెంజ్ అలర్టులు జారీ చేసింది. కామారెడ్డి, మెదక్ జిల్లాలకు నేడు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ రెండు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరించింది.

ఇక ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, రాజన్నసిరిసిల్ల, హన్మకొండ, వరంగల్, జనగాం, మహబూబాబాద్, సిద్ధిపేట, యాదాద్రి, సంగారెడ్డి, మహబూబ్ నగర్, వికారాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ లకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ మూడు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande