తెలంగాణ, నారాయణపేట. 26 సెప్టెంబర్ (హి.స.)
అంతరాష్ట్ర ముగ్గురు దొంగల ముఠాను అరెస్టు చేసి వారి నుంచి నాలుగు లక్షల విలువైన ఐదు షైన్ బైకులను స్వాధీనం చేసుకున్నట్టుగా నారాయణపేట డీఎస్పీ లింగయ్య తెలిపారు. శుక్రవారం మక్తల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ ఎన్.లింగయ్య మాట్లాడుతూ.. పట్టణానికి చెందిన రెహమాన్ అనే వ్యక్తి ఇటీవల ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ ను గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారని ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేయగా కర్ణాటకకు చెందిన దుర్గప్ప, ఎల్లప్ప ముఠాగా ఏర్పడి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో బైకులు దొంగతనం చేసి రాయచూర్ లో బైక్ మెకానిక్ గా ఉన్న శంషోద్దీన్ కు అప్పగించగా ఆయన వీటిని అమ్మి పెట్టేవాడని తమ ఎంక్వయిరీలో తెలిందని డీఎస్పీ తెలిపారు .
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు