అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకూడదు: సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్
తెలంగాణ, 26 సెప్టెంబర్ (హి.స.) అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకూడదని, లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని, సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరతోష్ పంకజ్ ఓ ప్రకటనలు హెచ్చరించారు. రానున్న 48 గంటలు జిల్లాకు భారీ వర్ష సూచన, ఎల్లో అలర్ట్ జారీ చే
సంగారెడ్డి ఎస్పి


తెలంగాణ, 26 సెప్టెంబర్ (హి.స.)

అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకూడదని, లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని, సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరతోష్ పంకజ్ ఓ ప్రకటనలు హెచ్చరించారు. రానున్న 48 గంటలు జిల్లాకు భారీ వర్ష సూచన, ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగిందని అన్నారు. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు చూడటానికి వెళ్లకూడదని, దాటే ప్రయత్నం కూడా చేయకూడదన్నారు. ప్రజల భద్రత దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. నిన్న సాయంత్రం నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పురాతనమైన, శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో నివాసం ఉండరాదని సూచించారు. అవసర సమయంలో డయల్ 100 లేదా సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande