హైదరాబాద్, 26 సెప్టెంబర్ (హి.స.)
మహిళల భద్రతకు తెలంగాణ మహిళా భద్రత విభాగం సంచలన నిర్ణయం తీసుకుంది. వేధింపులకు గురైన వెంటనే చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. బస్సులు, మెట్రోలు, ఆటోల్లో మహిళలు ప్రయాణిస్తున్నప్పుడు అసభ్యంగా తాకడం, ప్రవర్తించడం లాంటి ఆకతాయి పనులు చేస్తే వెంటనే పోలీసులకు సమాచారం తెలిపేలా టోల్ ఫ్రీ నెంబర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో ప్రయాణం చేసే స్త్రీలు, బాలికలకు సురక్షిత వాతావరణాన్నికల్పించే లక్ష్యంతో 100/112 నెంబర్ను ఏర్పాటు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు