తీవ్ర జ్వరంతో బాధపడుతోన్న పపన్ కళ్యాణ్.. సీఎం చంద్రబాబు ట్వీట్
అమరావతి, 26 సెప్టెంబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం వపన్ కళ్యాణ్ (Pawan Kalyan) గత నాలుగు రోజుల నుంచి తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. ఇప్పటి వరకు జర్వం తీవ్రత ఏమాత్రం తగ్గలేదని, దగ్గు ఎక్కువగా ఉండటంతో ఆయన ఇబ్బంది పడుతున్నారని వైద్యులు వెల్లడించారు
తీవ్ర జ్వరంతో బాధపడుతోన్న పపన్ కళ్యాణ్.. సీఎం చంద్రబాబు ట్వీట్


అమరావతి, 26 సెప్టెంబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం వపన్ కళ్యాణ్ (Pawan Kalyan) గత నాలుగు రోజుల నుంచి తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. ఇప్పటి వరకు జర్వం తీవ్రత ఏమాత్రం తగ్గలేదని, దగ్గు ఎక్కువగా ఉండటంతో ఆయన ఇబ్బంది పడుతున్నారని వైద్యులు వెల్లడించారు.

ఈ మేరకు ఇవాళ వైద్య పరీక్షల నిమిత్తం పవన్ కళ్యాణ్ మంగళగిరి నుంచి నేరుగా హైదరాబాద్ వెళ్లనున్నట్లుగా పార్టీ వర్గాల వెల్లడించాయి. ఈ నేపథ్యంలోనే పవన్ త్వరగా కోలుకోవాలని సీఎం చంద్రబాబు (CM Chandrababu) సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేశారు. అనారోగ్యం బారిన పడిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని అన్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేయడానికి, విస్తృతంగా ప్రశంసలు అందుకుంటున్న ‘OG’ మూవీ విజయాన్ని ఆస్వాదించడానికి మెరుగైన ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆశిస్తున్నా అంటూ ట్వీట్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande