తిరుపతి, 26 సెప్టెంబర్ (హి.స.)
: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(Ysrcp Party) అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Former Cm Jagan Mohan Reddy)ని అసెంబ్లీలో ఎమ్మెల్యే బాలకృష్ణ ‘‘సైకో’’ అని సంభోదించడాన్ని ఆ పార్టీ నేతలు తప్పు బట్టారు.
బాలకృష్ణకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.
తిరుపతి(Tirupati)లో వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. బాలకృష్ణకు వ్యతిరేకంగా పోస్టర్ ప్రదర్శన చేశారు. బాలకృష్ణ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
డౌన్.. డౌన్ బాలయ్య అంటూ నినాదాలు చేశారు. దీంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, వైసీపీ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. పలువురు వైసీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని వదిలిపెట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి