అమరావతి, 30 సెప్టెంబర్ (హి.స.):దక్షిణ కొరియాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రుల( బృందం పర్యటన కొనసాగుతోంది. ఏపీకి పెట్టుబడుల )సాధనే లక్ష్యంగా దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో పర్యటిస్తున్నారు మంత్రులు నారాయణ), బీసీ జనార్దన్ రెడ్డి(). దక్షిణ కొరియాలోని ఇండియా ఎంబసీ అధికారులు, ఏపీ ఈడీబీ అధికారులతో కలిసి ఈ పర్యటన కొనసాగుతోంది. ఇవాళ(మంగళవారం) ఉదయం కియా(KIA) కార్ల పరిశ్రమ హెడ్ క్వార్టర్స్‌ని సందర్శించారు మంత్రులు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ