తెలంగాణ, నిర్మల్. 5 సెప్టెంబర్ (హి.స.)
నిర్మల్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న చిరు వ్యాపారులపై పన్నుల (తైబజార్) వసూళ్లు వెంటనే నిలిపివేయాలని చిరు వ్యాపారులు ఎలాంటి రుసుము చెల్లించవద్దని బిజెపి శాసనసభ పక్ష నేత నిర్మల్ శాసనసభ్యులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ పట్టణంలో తై బజార్ కారణంగా చిన్న చిన్న వ్యాపారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, ఇతర అధికారులతో మాట్లాడి పట్టణంలో ఈ తై బజార్ టెండర్ ప్రక్రియను రద్దు చేయాలని కోరారు. పట్టణంలోని చిన్న చిన్న వ్యాపారులు ఇక నుండి వ్యాపార నిర్వహణ కొరకు ఎటువంటి రుసుము చెల్లించకూడదని, వ్యాపారాలు సాఫీగా కొనసాగించుకోవాలని ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు