హైదరాబాద్, 6 సెప్టెంబర్ (హి.స.)
తన జీవితం తెరిచి ఉంచిన పుస్తకం
అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు అన్నారు. యుకే నుంచి తిరిగి హైదరాబాద్ చేరుకున్న ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మీడియాతో మాట్లాడారు. కొంతకాలంగా ప్రతిపక్ష పార్టీలు నాపై ఆరోపణలు చేస్తున్నట్లు తెలిపారు. తన 20 సంవత్సరాల రాజకీయ జీవితం తెలంగాణ ప్రజలకు తెరిచిన పుస్తకం లాంటిదన్నారు. కవిత కూడా తనపై వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ వాఖ్యలు ఎందుకు చేస్తున్నారో వారి విజ్ఞతకే వదిలేస్తున్నట్లు వివరించారు. తాను కేసీఆర్ పరిపాలనలో పది సంవత్సరాలు పార్టీ కోసం క్రమశిక్షణగా, రాష్ట్రం అభివృద్ధిలో ప్రజల కోసం ఆరాటపడిన వ్యక్తినని, s విషయాలు ప్రజలకే తెలుసన్నారు. రైతులు ఈరోజు రాష్ట్రంలో ఎరువులు దొరకక రోడ్డు ఎక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని ప్రాంతాలలో వరదలకు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఇలాంటి పరిస్థితులలో రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత కేసీఆర్కు తెలుసన్నారు. తెలంగాణ రాష్ట్రం ద్రోహుల చేతులకు చిక్కిందన్నారు. రాబోయే రోజులలో కలిసికట్టుగా పనిచేసి ప్రజల సమస్య తీర్చడానికి అధికారంలోకి వస్తామని హరీష్ రావు స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు