హైదరాబాద్, 6 సెప్టెంబర్ (హి.స.)
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ సీనియర్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. తెలంగాణలో విద్యా వ్యవస్థ అధపాతాళంలోకి పోతుందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. సాంఘిక సంక్షేమ గురుకుల కాలేజీల్లో ఇప్పటికీ పాఠ్య పుస్తకాలు అందలేదు. ఈ అంశంపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు.
విద్యా సంవత్సరం ప్రారంభమై నేటి మూడు నెలలైంది. అయినా చాలా కాలేజీల్లో ఇప్పటికీ పాఠ్య పుస్తకాలు రాలేదని విద్యార్థులు రోదిస్తున్నారు. ఇందుకోసమేనా తమరు విద్యాశాఖను తమరి దగ్గరనే పెట్టుకున్నారా..? మీ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి దిశగా దూసుకుపోవడం లేదు.. ఇది నిజం.. అగాథంలోకి తెలంగాణ పోతుందని ఆర్ఎస్పీ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా మేల్కొనాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు