గణపతి నిమర్జనం వేళ సీఎం రేవంత్ రెడ్డి కీలక పిలుపు..
హైదరాబాద్, 6 సెప్టెంబర్ (హి.స.) గణపతి నిమజ్జన వేడుకల వేళ తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి కీలక పిలుపునిచ్చారు. హైదరాబాద్ మహానగరాన గల్లీ గల్లీలో.. తెలంగాణ రాష్ట్రాన పల్లె పల్లెలో.. 11 రోజులుగా కోట్లాది మంది భక్త జనుల పూజలు అందుకుని.. ప్రజలకు ఆశీస
సీఎం రేవంత్ రెడ్డి


హైదరాబాద్, 6 సెప్టెంబర్ (హి.స.)

గణపతి నిమజ్జన వేడుకల వేళ తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి కీలక పిలుపునిచ్చారు. హైదరాబాద్ మహానగరాన గల్లీ గల్లీలో.. తెలంగాణ రాష్ట్రాన పల్లె పల్లెలో.. 11 రోజులుగా కోట్లాది మంది భక్త జనుల పూజలు అందుకుని.. ప్రజలకు ఆశీస్సులు అందించి.. తిరిగి ప్రకృతి ఒడిలో చేరుతున్న గణేషుడికి ఘనంగా వీడ్కోలు పలుకుదాం. భక్తి శ్రద్ధలతో, తగు జాగ్రత్తలతో ప్రజలు గణేష్ నిమజ్జన వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటున్నాను” అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా గణేశ్ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. సుమారు 40 గంటల పాటు ఈ కార్యక్రమం జరగనుందని పోలీసులు అంచనా వేశారు. ముఖ్యంగా హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్లో మొత్తం 50 వేల విగ్రహాలు నిమజ్జనం అవుతాయని పేర్కొన్నారు. 30 వేలకు మందికి పైగా పోలీసులు బందోబస్తు విధుల్లో ఉన్నారు. అదనంగా మరో 3,200 మంది ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. సీసీ కెమెరాలు, డ్రోన్లతో గస్తీ నిర్వహిస్తున్నారు. మహిళల భద్రతకు షీటీమ్స్ సభ్యులు విధులు నిర్వర్తిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande