భద్రాద్రి కొత్తగూడెం, 5 సెప్టెంబర్ (హి.స.)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్య కలకలం రేపుతోంది. భద్రాచలం పట్టణంలోని కరకట్ట సమీపంలో గల ఒక ప్రైవేట్ లాడ్జిలో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడ్డారు. బాలికది అశ్వాపురం మండలం కాగా, యువకునిది ఆంధ్రప్రదేశ్లోని కుక్కునూరు మండలం రావిగూడెం గ్రామానికి చెందిన రవిగా గుర్తించారు. వీరిద్దరు గురువారం లాడ్జిలో రూమ్ అద్దెకు తీసుకోగా, శుక్రవారం ఉదయం అపస్మారక స్థితిలో ఉన్న వీరిని చూసిన లాడ్జి సిబ్బంది హుటాహుటిన ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. యువకుడు అప్పటికే మరణించాడని వైద్యులు తెలిపారు. బాలిక చికిత్స పొందుతూ మృతి చెందింది. యువకుడి వయసు 34 సంవత్సరాలు కాగా, బాలిక వయసు 16 సంవత్సరాలు కావడం విశేషం. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. వీరిద్దరూ క్రిమి సంహారక మందు సేవించినట్లు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు