హైదరాబాద్, 5 సెప్టెంబర్ (హి.స.)
ఖైరతాబాద్ విశ్వశాంతి మహా
గణపతిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు దర్శించుకున్నారు. ఈ మేరకు ఉత్సవ కమిటీ సభ్యులతో పాటు జిల్లా ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం సీఎం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భారీ పూలమాల వేసి హారతిచ్చారు. ఈ సందర్భంగా అర్చకులు సీఎం రేవంత్ రెడ్డికి ఆశీర్వచనం ఇచ్చి.. తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ..71 సంవత్సరాలుగా ఖైరతాబాద్ మహా గణపతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తున్న ఉత్సవ కమిటీ సభ్యులను ఆయన అభినందించారు. 69 అడుగుల గణపతి ప్రతిష్టించడం ఆశామాషీ వ్యవహారం కాదని అన్నారు. ఒక కార్యక్రమాన్ని ఒక్కరోజు చేయడమే తలకు మించిన భారమని.. కానీ, అంతటి మహత్కార్యాన్ని భుజాలపై వేసుకున్న ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని అన్నారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు