హైదరాబాద్, 5 సెప్టెంబర్ (హి.స.)
శిల్పకళా వేదికలో శుక్రవారం
నిర్వహించిన గురుపూజోత్సవ వేడుకలో ముఖ్యఅతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చాలా మంది ముఖ్యమంత్రులు ఫైనాన్స్, ఇరిగేషన్, రెవెన్యూ శాఖలను తమ దగ్గర పెట్టుకుంటారు. కానీ తాను విద్యాశాఖను తన దగ్గర పెట్టుకున్నట్లు తెలిపారు. అత్యంత వివాదాస్పద శాఖ విద్యా శాఖ.. అది తనకు వద్దని పలువురు చెప్పారు... కానీ వివాదాస్పదం సంగతి చూద్దామనే తన దగ్గర పెట్టుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. వాస్తవానికి విద్యాశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమైన శాఖ అని.. అందుకే దానిని తాను పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. కొంత మంది అవగాహన రాహిత్యంతో ఈ శాఖకు మంత్రిని పెట్టమని డిమాండ్ చేస్తున్నారని అన్నారు. విమర్శలకు ఒకటే మాట చెప్తున్నా... ఈ శాఖలో ఉన్న సమస్యల పరిష్కారం కోసమే దీనిని తన దగ్గర పెట్టుకున్నట్లు స్పష్టం చేశారు.ప్రపంచ దేశాలతో విద్యలో తెలంగాణ పోటీ పడాలని సీఎం అన్నారు. తెలంగాణకు ఎడ్యుకేషన్ పాలసి కావాలని స్పష్టం చేశారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..