తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా విజయం బిఆర్ఎస్ దే.. హరీష్ రావు
హైదరాబాద్, 5 సెప్టెంబర్ (హి.స.) కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్లో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ మూడు పిల్లర్లు కుంగితే ప్రభుత్వం పెద్ద రాద్ధాంతం చేస్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న ఆయన ప్రవాస బీఆర్ఎస్ నేతలు నిర్వహించిన సమ
హరీష్ రావు


హైదరాబాద్, 5 సెప్టెంబర్ (హి.స.)

కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్లో భాగమైన

మేడిగడ్డ బ్యారేజీ మూడు పిల్లర్లు కుంగితే ప్రభుత్వం పెద్ద రాద్ధాంతం చేస్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న ఆయన ప్రవాస బీఆర్ఎస్ నేతలు నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. ఏడాదిన్నర నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఇక వానాకాలంలో కరెంట్ డిమాండే ఉండదని.. ఈ సమయంలోనే బాహుబలి మోటార్లతో నీటిని రిజర్వాయర్లలోకి ఎత్తిపోసుకోవచ్చని అన్నారు.

హైడ్రా వల్ల హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ పూర్తిగా కుప్పకూలిందని హరీశ్ రావు కామెంట్ చేశారు. అందుకే రాష్ట్రంలో ఎన్నారైలు పెట్టుబడులు పెట్టేందుకు సుముఖంగా లేరని ఆరోపించారు. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ పార్టీదే విజయం రాసిపెట్టుకోండని కామెంట్ చేశారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande