శ్రీకాకుళం, 5 సెప్టెంబర్ (హి.స.)
శ్రీకాకుళం నగరంలోని కాకినాడ ఆదిత్య జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సర విద్యార్థి నిమ్మ ప్రదీప్ రెడ్డి(18) గురువారం సాయంత్రం మృతి చెందారు. కళాశాలలో నిర్వహిస్తున్న గురుపూజోత్సవం వేడుకల్లో స్నేహితులతో కలిసి పాల్గొన్న విద్యార్థి ఒక్కసారిగా కుప్పకూలి పోయాడు. యాజమాన్యం వెంటనే ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రదీప్ తండ్రి మహేశ్ కృష్ణాపార్క్ సమీపంలో చిరు వ్యాపారి. విద్యార్థి చిన్నప్పటి నుంచి మూర్ఛ, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ