హైదరాబాద్, 5 సెప్టెంబర్ (హి.స.) 'కాళేశ్వరం' అవినీతి అంశంపై మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ మేరకు సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ ఇవాళ హైదరాబాద్ కు వచ్చారు. కోఠీలోని సీబీఐ బ్రాంచ్ ఆఫీసులో అధికారులతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదికపై విచారణ నేపథ్యంలో ఆయన ఆకస్మికంగా హైదరాబాద్కు ప్రధాన్యతను సంతరించుకుంది. కాగా, కాళేశ్వరంపై కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసిన విషయం విదితమే.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..