హైదరాబాద్, 5 సెప్టెంబర్ (హి.స.)
జర్మనీకి చెందిన బేబిగ్ మెడికల్ కంపెనీ
చైర్మన్, సీఈవో జార్జ్ చాన్ బృందం ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ని జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో కలిశారు. రాష్ట్రంలో మెడికల్ ఎక్విప్మెంట్ ఉత్పత్తి యూనిట్ను ప్రారంభించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రికి తెలిపారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. బేబిగ్ సంస్థకు అవసరమైన సహకారం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. మెడికల్ ఎక్విప్మెంట్ ఉత్పత్తి చేసే యూనిట్ను నెలకొల్పేందుకు అనువైన స్థలం, ఇతర అంశాలకు సంబంధించి అధ్యయనం చేసి వెంటనే నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వాసుపత్రుల్లో మెడికల్ ఎక్విప్మెంట్తో పాటు, క్యాన్సర్ చికిత్సకు ఉపయోగపడే రేడియేషన్ సెంటర్లను కూడా ఏర్పాటు చేయాలని బేబీగ్ ప్రతినిధులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు