మంత్రి సీతక్క ను కలిసిన ఇస్కాన్ ప్రతినిధులు.. కీలక విజ్ఞప్తి
హైదరాబాద్, 5 సెప్టెంబర్ (హి.స.) ప్రజాభవన్ లో మంత్రి సీతక్కను శుక్రవారం ఇస్కాన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నేరెళ్ల గ్రామంలో 18 ఎకరాల్లో నిర్మిస్తున్న ఇస్కాన్ ప్రాజెక్టుకు రహదారి మార్గం కల్పించాలని మంత్రి సీతక్కకి
మంత్రి సీతక్క


హైదరాబాద్, 5 సెప్టెంబర్ (హి.స.)

ప్రజాభవన్ లో మంత్రి సీతక్కను శుక్రవారం ఇస్కాన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నేరెళ్ల గ్రామంలో 18 ఎకరాల్లో నిర్మిస్తున్న ఇస్కాన్ ప్రాజెక్టుకు రహదారి మార్గం కల్పించాలని మంత్రి సీతక్కకి ఇస్కాన్ బృందం విజ్ఞప్తి చేసింది. నేరెళ్లలో గోశాల, అన్నదాన సత్రం, సేంద్రియ వ్యవసాయ పద్ధతుల శిక్షణ, సోలార్ విద్యుత్, సాలిడ్ వాటర్ వేస్ట్ మేనేజ్మెంట్ తో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఇస్కాన్ చేపట్టనుంది.ఆ ప్రాజెక్ట్ కు రహదారి వసతి కల్పించాలని వారు మంత్రి సీతక్కకు విజ్ఞప్తి చేశారు. దీనిపై మంత్రి సీతక్క సానుకూలంగా స్పందించారు. ఇస్కాన్ ప్రాజెక్టు కు రహదారి నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పీఆర్ ఈఎన్సీ కి ఆదేశాలు జారీ చేశారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande