వనపర్తి, 5 సెప్టెంబర్ (హి.స.)
తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రేపు(శనివారం) వనపర్తి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో జిల్లాలోని పెద్దమందడి మండలం, మంగంపల్లి గ్రామానికి రానున్నారని వనపర్తి నియోజకవర్గం శాసనసభ్యులు మేఘారెడ్డి శుక్రవారం తెలిపారు. మంగంపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించుకున్న రాధమ్మ ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో మంత్రి పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మహబూబ్ నాగర్ జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, నాగర్ కర్నూల్ ఎం.పి డాక్టర్ మల్లు రవి, గృహ నిర్మాణ శాఖ మేనేజింగ్ డైరెక్టర్, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభిలు పాల్గొంటారని ఎమ్మెల్యే మేఘారెడ్డి పేర్కొన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు